హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా తుపాకుల మోతతో ఉలిక్కిపడింది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు బుధవారం ఉదయం ఒక హై-వోల్టేజ్ సినిమా ఎన్‌కౌంటర్‌కు వేదికైంది. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను వణికిస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో నల్గొండ పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపైనే కత్తులతో దాడికి తెగబడ్డ అంతరాష్ట్ర ముఠా నాయకుడిని లొంగదీసుకోవడానికి ఖాకీలు ఆయుధాలు గాల్లోకి లేపారు. అసలు ఈ ఎన్‌కౌంటర్ ఎక్కడ జరిగింది? ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం.
ఈ సంచలన ఘటన హైదరాబాద్ శివార్లలోని బొంగులూరు గేట్ ఎగ్జిట్ నంబర్-12 సమీపంలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా సీసీఎస్ (CCS) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో వందకు పైగా నేరాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న భూషణి శ్రీకాంత్.. తన అనుచరులతో కలిసి ఒక డీసీఎం (DCM) వాహనంలో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అత్యంత రహస్యంగా వ్యూహం రచించి, బొంగులూరు గేట్ వద్ద నిందితుల వాహనాన్ని చుట్టుముట్టారు.
అయితే పోలీసులను చూడగానే నిందితులు లొంగిపోవడానికి సిద్ధపడలేదు. సినిమా విలన్లను తలపిస్తూ.. తమ వద్ద ఉన్న పదునైన కత్తులతో పోలీసు సిబ్బందిపైనే ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ ఊహించని ఘోర దాడిలో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్నా వెనక్కి తగ్గని పోలీస్ సిబ్బంది.. పరిస్థితి చేదాటిపోతోందని గ్రహించారు. నిందితులు పారిపోకుండా, అలాగే తమ ప్రాణాలను రక్షించుకోవడానికి మొదట గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి హెచ్చరించారు. అయినప్పటికీ ప్రధాన నేరస్థుడు శ్రీకాంత్ మరింత రెచ్చిపోవడంతో, పోలీసులు అతని కాళ్లపై లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. బుల్లెట్ తగలడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
పోలీసుల కాల్పుల్లో గాయపడిన భూషణి శ్రీకాంత్‌ను తక్షణమే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో శ్రీకాంత్‌తో పాటు అతని ముఠాకు చెందిన మరో ఇద్దరు సత్కారపు క్రిమినల్స్ ను పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ శ్రీకాంత్ నేర చరిత్ర వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతనిపై ఏకంగా 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యలు, భారీ హైవే దోపిడీలు, దారిదోపిడీలకు ఇతను కేరాఫ్ అడ్రస్. అంతేకాదు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2007వ సంవత్సరంలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో ఇతను 'A2' నిందితుడిగా ఉన్నాడని ఉన్నతాధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోనే అత్యంత బిజీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక్కసారిగా తుపాకుల మోత వినపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం అదనపు బలగాలతో బొంగులూరు సమీపంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ అంతరాష్ట్ర ముఠా అరెస్టుతో మరికొన్ని పాత దోపిడీ కేసుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని క్రైమ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిజీ వరల్డ్. ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.
.png)

0 కామెంట్‌లు