కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఘోరం..
క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క
అనుమానాస్పద మృతి!
"రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఊహించని షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది! ఈ కేసు చేధించడంలో అత్యంత కీలకమైన ఆధారం అనుకున్న పెంపుడు కుక్క శనివారం అనూహ్యంగా మరణించింది! అసలు ఈ కుక్క ఎలా చనిపోయింది? దీని వెనుక ఏమైనా కిడ్నాపర్ల పెద్ద కుట్ర ఉందా? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం!"
వారం రోజుల క్రితం రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ కొండ ప్రాంతం వైపు వెళ్లి అదృశ్యమైంది. వందలాది మంది పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించినా పాప ఆచూకీ దొరకలేదు. అయితే, మూడు రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క మాత్రం ఒంటరిగా గ్రామంలోకి తిరిగి వచ్చింది.
దీనితో పోలీసులు ఒక హైటెక్ ప్లాన్ వేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జీపీఎస్ (GPS) ట్రాకర్‌ను తెప్పించి, ఆ కుక్క మెడకు అమర్చి అడవిలోకి వదిలారు. అది వెళ్లే దారిని బట్టి చిన్నారి ఆచూకీ కనిపెట్టవచ్చని పోలీసులు భావించారు. ఆ కుక్క దాదాపు 8 కిలోమీటర్ల మేర వివిధ ప్రాంతాల్లో తిరిగి మళ్లీ ఇంటికి వచ్చింది. కానీ, అలా వచ్చిన కొద్దిసేపటికే వింతగా ప్రవర్తిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది!"
కుక్క ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్లే చనిపోయిందని కొందరు అంటుంటే.. కేసును పక్కదారి పట్టించడానికి, చిన్నారి ఆచూకీ దొరకకుండా చేయడానికి ఎవరైనా దానికి విషం ఇచ్చి చంపేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెంపుడు కుక్క మరణంతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు.
మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? దీని వెనుక ఎవరిదైనా కుట్ర ఉందనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!"
.png)

0 కామెంట్‌లు