రెండు ప్రముఖ ఆలయాల్లో భారీ చోరీలు.. బురఖా వేసుకుని మరీ! | Temple Thefts in Basara & Koilkuntla



 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో రెండు ప్రముఖ ఆలయాలలో హుండీలు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు . ఇందులో ఒక చోట దొంగ బురఖా వేసుకొని రావడం ఇంకో చోట కెమెరాలపై బట్టలు కప్పేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.



మొదటి ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగుడు అర్ధరాత్రి వేళ చొరబడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఒంటరిగా, బురఖా ధరించి ఆలయంలోనికి ప్రవేశించాడు. అనంతరం స్వామివారి హుండీని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆలయ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇక రెండో ఘటన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కలకలం రేపింది. ఆలయ మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు.. అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా అపహరించుకుపోయారు. ఉదయం అభిషేకం కోసం వెళ్లిన పూజారులు తాళాలు పగిలి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు చాలా పక్కా ప్లాన్‌తో వచ్చి, ఆలయం దగ్గర ఉన్న మూడు సీసీ కెమెరాలకు బట్టలు కప్పి మరీ ఈ చోరీకి పాల్పడ్డారు. వ్యాస మహర్షి ఆలయం వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అంజనాదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

 ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో భద్రతా లోపాలు ఇలా బయటపడటంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస దొంగతనాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 



Basara Temple Theft, Koilkuntla Temple Theft, Satyanarayana Swamy Temple, Gnana Saraswathi Temple Basara, Temple Thieves Telugu News, CCTV Burkha Thief, Andhra Pradesh Crime News, Telangana Crime News, Breaking News Telugu


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు