హైదరాబాద్ ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో అమ్మాయిలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఒక షాకింగ్ హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది! స్నాప్‌చాట్ లో పరిచయమైంది కదా అని నమ్మి వెళ్లిన ఒక యువతికి నరకం చూపించాడు ఓ కేటుగాడు. హోటల్ రూమ్ లో కత్తి చూపించి బెదిరించడమే కాకుండా.. బలవంతంగా న్యూడ్ వీడియోలు తీసి లక్షల్లో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అసలు గచ్చిబౌలిలో ఏం జరిగింది? ఆ కిలాడీ నాని గాడి అసలు లీలలు ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చూద్దాం."
స్నాప్‌చాట్ పరిచయం.. హోటల్ రూమ్‌లో కత్తితో నరకం!
"పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిలారి నాగతేజ అలియాస్ నాని అనే 24 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో అపరిచిత మహిళలను టార్గెట్ చేయడంలో దిట్ట. ముఖ్యంగా స్నాప్‌చాట్ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, మాయమాటలతో లవ్ ట్రాప్ లోకి దించుతాడు. ఈ క్రమంలోనే గచ్చిబౌలిలోని ఒక హోటల్ రూమ్‌కి ఓ యువతిని రప్పించాడు. అక్కడే అసలు రంగు బయటపెట్టాడు. కత్తి తీసి ఆమె గొంతుపై పెట్టి చంపేస్తానని బెదిరించి.. ఆమె అంగీకారం లేకుండా నగ్నంగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు. ఆ తర్వాత మొదలైంది అసలు బ్లాక్‌మెయిల్ ధందా!"
ఆన్‌లైన్ లో లక్షలు వసూలు.. చివరకు పోలీసుల వేట!
"ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ ఆ మహిళను భయభ్రాంతులకు గురిచేసి, ఆమె నుంచి దాదాపు రూ. 1.1 లక్షలు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. నాగతేజ వేధింపులు భరించలేక సదరు మహిళ జూన్ 22న గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని ట్రాక్ చేసి జూన్ 25న అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న రెండు మొబైల్ ఫోన్లు, బెదిరింపులకు వాడిన కత్తిని సీజ్ చేశారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పర్సనల్ డీటెయిల్స్, ఫోటోలు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు."
"ఫ్రెండ్ రిక్వెస్ట్ లే కదా అని నమ్మి మోసపోతున్న ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటి?
.png)

0 కామెంట్‌లు